calender_icon.png 12 February, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి...

12-02-2025 05:09:48 PM

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రతి గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా కార్యకర్తలంతా కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని దంతన్ పల్లి గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు రమా సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రజాహితం కోసం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో 10 ఏళ్లు దగా పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్ నిర్మించేందుకు ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.