11-03-2025 01:20:46 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ(Congress party) పాలన సాగిస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityal Mandal)లోని గోపాలపురం, ముచినిపర్తి, చల్లగరిగా, జూకల్, తిరుమలాపూర్, చిట్యాల మోడల్ స్కూల్ ఆవరణంలో సిసి రోడ్లు,పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రైతన్నల అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తుందని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హేమ,ఎంపీడీవో జయశ్రీ, టిపిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు గూ తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూఖిరాల మధు వంశీకృష్ణ,మూల శంకర్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.