calender_icon.png 26 March, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో 24న కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశం

21-03-2025 05:26:46 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం(Congress Party Preparatory Meeting) నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు(Congress Kamareddy District President Kailas Srinivasa Rao) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కాంగ్రెస్ పార్టీ సన్నాహాక సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ షట్కర్, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు, తెలంగాణ ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, పీసీసీ అబ్జర్వర్ వెంకట స్వామి, మాజీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు , మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలో, నాయకులు కార్యకర్తలు పాల్గొంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.