కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ రాజకీయ శిక్షణ తరగతులు నాగార్జునసాగర్‌లో ఈ నెల 11 నుండి నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌ఆలీ శుక్రవారం తెలిపారు. కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. టిపిసిసి ఆదివాసీ చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ గిరిజన సాధికారిత, రాజకీయ శిక్షణ తరగతులను దేశవ్యాప్తంగా 250 మందిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేయడం జరిగిందని, డెలిగేట్స్‌గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ శిక్షణ తరగతులకు దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు వచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొంటారన్నారు. కామారెడ్డి జిల్లా నుండి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సేల్ అధ్యక్షుడు రాణాప్రతాప్ రాథోడ్, నునావత్ గణేష్‌నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేతావత్ నరేష్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు బాన్సువాడలను ఇంచార్జీలుగా నియమించడం జరిగిందన్నారు.