24-04-2025 07:48:03 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు(Congress party district president Kokkirala Vishwaprasad Rao) కోరారు. ఈనెల 27(ఆదివారం) ఉదయం 10.30 లకు జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిధిలుగా స్టేట్ లైబ్రరీ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్, నర్సయ్య హాజరు అవుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గ మండలంతో పాటు నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, మాజీ మార్కెట్ చైర్మన్ లు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లులు, మాజీ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్, కిసాన్ సెల్, మైనారిటీ సెల్, ఎస్సీ సెల్, ఎన్ఎస్ యుఐ, మహిళా కాంగ్రెస్ నాయకులు సకాలంలో హాజరై ఈ కార్యక్రమన్ని విజయవంతం చేయగలరని కోరారు.