calender_icon.png 21 October, 2024 | 3:23 AM

కాప్రా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం

20-10-2024 08:58:48 PM

కాప్రా,(విజయక్రాంతి): రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం, అభివృద్ధినే లక్ష్యంగా ప్రజా పాలన సాగుతుందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు అందుతున్నాయి అన్నారు. ఇవి రెండూ కూడా మరింత పారదర్శకంగా ప్రజలకు చేరవేసేందుకే రాష్ట్రంలో సరికొత్తగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు నాగశేషు గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కోసం సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి పరమేశ్వర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీలు కీలక పాత్రను పోషించాలని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి సోషించారు. ప్రభుత్వ ఆలోచనలకు, లక్ష్యాలకు అనుగుణంగా ఈ కమిటీలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివ మణి, ధనపాల్ రెడ్డి, సీత రామ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు నాగ శేషు, మేడ్చెల్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ విట్టల్ నాయక్, పూర్ణ, మాజీ కౌన్సెలర్ రాజేందర్, పవన్, బాబురావు, మల్లారెడ్డి, రాకేష్, మచ్చ శ్రీకాంత్, సోమనాథ్, కొబారి నాగరాజ్, శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీహరి, జగదీష్, సుమన్, సంతోష్ , జి బాలయ్య , రామ్ చందర్, హరి, రాజు, కృష్ణ, కనకరాజ్, జష్మంత్  యూత్  కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, అరుణ్ కిరణ్,  అజయ్, విజయ్  తదితరులు పాల్గొన్నారు