07-04-2025 06:49:03 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని పాత కొత్త కొమ్ముగూడెం, మున్సిపాలిటీలోని పలు వార్డ్ లలో జై బాపు, జై భీమ్, జై సంవిధన్, అభియన్, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రకు ముఖ్య అతిధిగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కలసికట్టుగా పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు.
మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్, మండల అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచందర్ రావు, చింత అశోక్ కుమార్, నాగభూషణం, జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు అనిల్, పట్టణ యూత్ అధ్యక్షులు రాందేని వెంకటేష్, యూత్ అధ్యక్షులు బొప్పూ సుమన్, సందేలా సురేష్, మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, సురేష్ నాయక్, బియ్యల తిరుపతి, కందుల మోహన్, రాజు, కాంగ్రెస్ నాయకులు అన్నం చిన్నాన్న, మండల, మున్సిపాలిటీ కార్యకర్తలు పాల్గొన్నారు.