calender_icon.png 6 April, 2025 | 2:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

05-04-2025 10:07:26 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహం వరకు శనివారం నాడు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కాలినడకన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుందని, రాజ్యాంగం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

అంబేద్కర్ కేవలం కొంతమంది ప్రయోజనాల కోసమే రాజ్యాంగాన్ని రాయలేదని,రాజ్యాంగం ద్వారా కుల మత వర్గ లింగ బేధాలు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా రాజ్యాంగ రూపకల్పన చేశారని అన్నారు. కొంతమంది బిజెపి నాయకులు అంబేద్కర్ ను ఒక వర్గానికే పరిమితం చేసి అవమానిస్తున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారతీయులందరికీ స్వేచ్ఛ స్వతంత్రం ప్రజాస్వామ్య హక్కులను అందించాడని అంత గొప్ప ప్రతిభావంతున్ని పార్లమెంటు సాక్షిగా గత డిసెంబర్లో కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించడం దుర్మార్గమైన చర్య అని ప్రజాస్వామ్య విలువలని కాల రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఉషా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, ఎన్ ఎస్ యు ఐ శ్రీనివాస్, సంజీవులు, సురేందర్, సాయిబాబా, కిషన్, రోడ్డ నరేష్, చిరంజీవిలు వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.