calender_icon.png 28 December, 2024 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్‌ నాయకులు

11-09-2024 01:51:35 PM

వట్టిపల్లి నుండి సాల్వాపూర్ రోడ్డు మరమత్తులు చేసి కొత్త డబుల్ రోడ్డు వయాలని మంత్రికి వినతి

జగదేవపూర్, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం జగదేవపూర్ మండల పరిధిలోని వట్టిపల్లి గ్రామస్తులు మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వట్టిపల్లి గ్రామం నుండి సాల్వాపూర్ వరకు డబుల్ రోడ్డు కోసం మంత్రికి వినతి పత్రం సమర్పించారు. రోడ్డు సరిగ్గా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటునట్లు మంత్రికి వివరించారు. మంత్రి వెంకటరెడ్డి వెంటనే సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే డబుల్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వట్టిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు రాజేందర్రెడ్డి, వెంకట్రామ్రెడ్డి, రమేష్, తిరుపతిరెడ్డి, మునీర్, సుదర్శన్, బాలరాజు, సాయిబాబా, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.