01-03-2025 05:41:31 PM
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ రెడ్డి
కనీస వసతులు ఏర్పాటు చేయలేకపోయినా గత ప్రభుత్వం
డ్రైనేజీ కాలువ లేక ఇండ్ల ముందు వెదజల్లుతున్న దుర్వాసన
కరెంటు ఏర్పాటు చేయక అంధకారంలో తండవాసులు
పరిశీలించి ధైర్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు
కోదాడ,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని బిక్యతండా గ్రామంలో గత ప్రభుత్వం 60 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. అయితే వాటికి కనీస వసతులు కల్పించకపోవడంతో తండావాసులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో వారి బాధలను పంచుకున్నారు. గత పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఇండ్లను నిర్మించినప్పటికీ కరెంటు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తండావాసులు నానాఅవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వరప్రసాద్ మాట్లాడుతూ...ఇన్నేళ్ల నుండి కరెంటు లేక, అంధకారంలో ఉంటున్న తండవాసుల అవస్థలను పరిశీలించామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇర్లా సీతారాం రెడ్డి, ఎర్రవరం పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరనేని వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ అంబేద్కర్, గ్రామ శాఖ అధ్యక్షుడు నాన్ రాజ్ రాములు, రెడ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.