సూర్యాపేట,(విజయక్రాంతి): తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో నాగారం గ్రామానికి మొదటి విడతలోనే 100 ఇండ్లు మంజూరి చేయగలరని గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని హైదరాబాద్ లోని మంత్రుల నివాసములో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను విన్నవించగా తప్పకుండ 100 ఇండ్లు మంజూరి చేసి ఇండ్ల శంకుస్థాపన కు కూడ వస్తా అని మాట ఇవ్వడం జరిగింది.
ఇందిరమ్మ ఇండ్లతో పాటు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రైతువేదిక ను పూర్తి చేయుటకు, నిరుద్యోగులకు గ్రంధాలయం,నూతన గ్రామపంచాయితీ భవనం,పశువుల ఆసుపత్రి, మండలం నకు సంబందించిన మొత్తం ప్రభుత్వ భవనాలు నాగారం లోనే నిర్మాణం చేయుట లాంటి పలు విషయాలు మంత్రితో చర్చించగా సానుకులంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రిని కలిసిన వారిలో జిల్లా కాంగ్రెస్ నాయకులు జాజుల వీరయ్య, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన వెంకట బిక్షం తదితరులు ఉన్నారు