22-02-2025 01:33:05 AM
ఎల్లారెడ్డి 21 ఫిబ్రవరి ః ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని పట్టభద్రుల ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉట్కూరి నరేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తుందని ఆరోపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎదేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తుందన్నారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల బీసీ నాయకులు శంకర్, మాజీ ఎంపిటిసి గురు ప్రతాప్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.