calender_icon.png 4 April, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టు పంచల వేడుకకు హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు

03-04-2025 06:10:33 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన పరందాములు తనయుల పుట్టు పంచల వేడుకకు గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరంధాములు ఇద్దరు తనయుడు హర్షవర్ధన్, సాత్విక్ లను ఆశీర్వదించి కానుకలను అందించామన్నారు. చిన్నారులు భవిష్యత్తులో బాగా చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కళ్యాణి గ్రామ అధ్యక్షులు సంజీవులు, కళ్యాణి గ్రామ మాజీ సర్పంచ్ మైదాపు శ్రీనివాసులు, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గంగారం సాయిలు, నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.