calender_icon.png 19 March, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

19-03-2025 05:37:32 PM

కొండాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, రాజీవ్ యువ వికాస పథకం అసెంబ్లీలో చట్టం చేయడం, యువ వికాసం పథకం దిగ్విజయంగా ప్రారంభించడంతో కొండాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మల్కాపూర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ వై. ప్రభు మాట్లాడుతూ.... ఒకే రోజు మూడు ఘన విజయాలను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు.

రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం రెండు బిల్లులను ఆమోదపర్చడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఎల్ .శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, నాయకులు గౌరి రెడ్డి శ్రీధర్ రెడ్డి, నర్సింలు, గురు రాజ్, వెంకటేశం గౌడ్, సునీల్, ప్రశాంత్ గౌడ్, అనిల్, శివ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జైరాములు,షెఫీ తదితరులు పాల్గొన్నారు.