హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ర్టంలో మరింత బలోపేతం అవుతుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. కాంగ్రె స్ పార్టీ బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. బుధవారం బాగ్ అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటికి పీసీసీ అధ్యక్షుడు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్‌ను వీహెచ్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిన్ రెడ్డి, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.