calender_icon.png 29 September, 2024 | 5:56 PM

రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే..

29-09-2024 03:30:26 PM

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి,(విజయక్రాంతి): రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఆదివారం ఎలిగేడు మండలంలోని, దూళికట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 108 వ సర్వ సభ్య సమావేశం చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆదివారం రోజున ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే రైతులకు సొసైటీ సభ్యులకు అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దూళికట్ట మూల చెరువు మత్తడిని స్థానిక నాయకులతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులకు సహకార సంఘాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడంతో పాటు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని, నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, గత ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద పుట్టి ప్రతి మాట అబద్ధాలు చెబుతూ రైతులను నిలువు దోపిడి చేసిందని ఏద్దేవ చేశారు.

ప్రభుత్వం వర్షాకాలం పంటకు సన్న రకాల వడ్లకు రూ.500 రూపాయల బోనస్ ఇస్తామని తెలిపిందని, రైతుల సంక్షేమం కోసం బాగు కోరేది సీఎం రేవంత్ రెడ్డి అని, నిరంతరం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని బీఆర్‌ఎస్‌ నాయకులు పనిగట్టుకొని బదనాం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దూళికట్ట సింగిల్ విండోచైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, జూలపల్లి ప్రాధమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు గండు సంజీవ్, దూళికట్ట ప్రాధమిక సంఘం డైరెక్టర్లు, అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.