01-04-2025 07:57:30 PM
వంద రోజుల్లో అమలు చేస్తామని 15 నెలలు గడిచిపోయిన వాగ్దానాలు నెరవేర్చలేదు..
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు సమర్పణ..
భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆనాడు సీఎల్పీ లీడర్ గా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి.. ప్రజలకు పంచి వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చి 15 నెలల గడుస్తున్నా హామీల అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కపై కేసు నమోదు చేయాలని భద్రాచలం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో దరఖాస్తు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మానే రామకృష్ణ, మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, గుంజ ఏడుకొండలు, పార్టీ నాయకులు కాపుల సూరిబాబు, తాండ్ర ప్రసాద్, యువజన నాయకులు కీసరి యువరాజు, కొల్లిపాక శివ, సోషల్ మీడియా నాయకులు ఇమంది నాగేశ్వరరావు, రావూరి రవి కిరణ్, నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మీ, ఏలూరు ప్రియాంక తదితరులు ఉన్నారు.