పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో కోల్పోయిందని పంచాయతీరాజ్, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో ఆమె పర్యటించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. వారి స్వగ్రామంకు వెళ్లి ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.శ్రీనివాస రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చి శ్రీనివాసరెడ్డి కుటుంబంకు అన్ని విధాలుగా అండగా వుంటామని భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.