కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ
మంథని, (విజయక్రాంతి): ఖబర్దార్ పుట్ట మధు.. మంత్రి శ్రీధర్ బాబును విమర్శించే హక్కు నీకు లేదని, నువ్వు కల్లు తాగిన కోతి లెక్క మా నాయకునిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీలు హెచ్చరించారు. ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఇటీవల కూలిన ఓడేడు బ్రిడ్జిపై మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా హెచ్చరించారు.
బీఆర్ఎస్ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొబ్బరికాయ కొట్టిన అనంతరమే సదరు కాంట్రాక్టుతో నా కమిషన్ నాకు కావాలి అని అతనిని బెదిరించినది నువ్వు కాదా అన్నారు. మూడు నెలల క్రితం బ్రిడ్జి కూలిన అనంతరం మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి స్థానిక ముత్తారం మండల నాయకులు తెలియజేయగానే సంబంధిత అధికారులను పిలిచి బ్రిడ్జికి అయ్యే ఖర్చు ఎంత అని కొత్త ఎస్టిమేంట్ రూ. 63 కోట్లుగా తయారు చేశారుని, దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉంది.. మరొకసారి శ్రీధర్ బాబు పైన గాని శ్రీను బాబు పైన గాని అవాకులు చివాకులు మాట్లాడితే ప్రజా క్షేత్రంలో నీకు శిక్ష తప్పదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల మహిళా అధ్యక్షురాలు గోవిందుల పద్మా ఆనంద్,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనుముసమ్మయ్య,ముత్తారం మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కోల విజయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని బుచ్చం రావు,తూటి రఫీ,రాపల్లి రామన్న,బాలసాని రాజ్ కుమార్,చేలుకల జితేందర్,అనుము ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.