calender_icon.png 24 February, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్ రెడ్డి గెలుపుకు ప్రతి కార్యకర్త సైనికునిలాపని చేయాలి

21-02-2025 04:22:47 PM

హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.

 హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్-నిజాంబాద్-ఆదిలాబాద్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి(Alphores Narender Reddy)ని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికునిలా పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(Parakala MLA Revuri Prakash Reddy)  పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణ బాబు ఆధ్వర్యంలో పార్టీ కో-ఆర్డినేటర్ల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే  రేవురు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... హుజురాబాద్ నియోజకవర్గం చైతన్యవంతమైనదన్నారు. 

హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇవ్వాలని, హుజురాబాద్ సత్తా చాటాలని కో-ఆర్డినేటర్ లను కోరారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓటరును నేరుగా కలవాలని సూచించారు. ప్రతి కార్యకర్త కష్టపడితేనే విజయం సాధిస్తామని తెలిపారు. పట్టభద్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఓటర్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు.