calender_icon.png 3 April, 2025 | 8:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు బలహీన వర్గాల ప్రజలదే కాంగ్రెస్ పార్టీ...!

02-04-2025 10:37:00 PM

ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్..

వైరా (విజయక్రాంతి): పేద బడుగు బలహీన వర్గాల ప్రజలదే కాంగ్రెస్ పార్టీ అని, వారి అభివృద్ధి కోసం నిరంతరం కాంగ్రెస్ పాటు పడుతుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పేర్కొన్నారు. వైరా నియోజకవర్గ పరిధిలోని వైరా మండలం వ ల్లాపురం గ్రామంలో బుధవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత జై బాపు జై భీమ్ జై సంచిదాస్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించి చౌక దుకాణం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన సంక్షేమ పథకాల్లో మరో గొప్ప పథకం ఇది అని, పేదవారు ఆకలితో అలమటించకుండా ఉండాలని పౌష్టిక ఆహారం అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సన్న బియ్యం పంపిణీ  కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

బిజెపి పదేళ్ల పాలనలో నిరంకుశ పాలన సాగించి దేశాన్ని దివాలా స్థితికి తీసుకొచ్చిందని విమర్శించారు. ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగకుండా సంపన్న వర్గాలకు వ్యాపారవేత్తల కడుపు నింపిందన్నారు. బిజెపి నిరంకుశ పాలన వివరిస్తూ రాజ్యాంగంపై విధ్వంస కాండను వివరించాలనే ఉద్దేశంతోనే జై బాబు జై భీమ్ జై సంవేదాన్ కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా జాతీయ జెండా చేత బూని పాదయాత్ర నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వల్లాపురం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల సత్యం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరి సీతారాములు, రాష్ట్ర మార్క్ పేడ్ నాయకులు బొర్రా రాజశేఖర్, మొక్క శేఖర్ గౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, పాలేటి నరసింహారావు, బోళ్ల గంగారావు యూత్ కాంగ్రెస్ పమ్మి అశోక్, పొట్టపల్లి శ్రీను మచ్చ బుజ్జి శ్రీరామనేని తిరుపతిరావు యన్నం కోటిరెడ్డి శీలం చంద్రశేఖర్ రెడ్డి దార్నా రాజశేఖర్ కట్ల సంతోష్ ఇటుకల మురళి ఆదర్శ రైతు తుమ్మల రాణా ప్రతాప్ వేల్పుల మురళి గరిడేపల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.