02-04-2025 12:16:03 AM
మేడ్చల్, ఏప్రిల్ 1(విజయ క్రాంతి): పార్లమెంటులో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించనున్న ధర్నాలో పాల్గొనేందుకు మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు తరలి వెళ్లా రు.
మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేస్ యాదవ్ ఆధ్వర్యంలో బయలు దేరారు. ఢిల్లీ వెళ్లిన వారిలో మేడ్చల్ మార్కె ట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, గుండ్ల పోచంపల్లి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సా యి పేట శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాపరా జు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు యాదవ్ తదితరులున్నారు.