calender_icon.png 10 January, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్ను

06-12-2024 07:45:51 PM

నిర్మల్‌ (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉండి ఇచ్చిన హమీలు నేరవేర్చుతుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు రైతులపై మొసలి కన్నీరు కారూస్తు రాజకీయం చేసి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని నిర్మల్ డిసిసి అద్యక్షులు శ్రీహరిరావు ఆరోపించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ మండలంలోని లోలం గ్రామం, నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గోన్నారు. మొదటగా ఆయా గ్రామల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనతరం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రజలకు మహిళలకు ఇచ్చిన హమీలు నెరవేర్చడంతో వారు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంకు పాలాభిషేకం చేశారు. ఏడాది పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ భీంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.