calender_icon.png 8 January, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హమీలను వెంటనే అమలు చేయాలి

07-01-2025 12:09:58 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు 420 హమీలను ఇచ్చి మోసం చేశారని స్థానిక సంస్తల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former MLA Jajala Surender) అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎల్లారెడ్డి  పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఆయన ఎండగట్టారు.

ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇచ్చిన హమీల్లో ఒకటి కూడా నేరవేర్చాలేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. ఎకరాకు రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తానని చెప్పి ఇప్పటికి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని ప్రజలకు ఎం అర్థమవుతుందన్నారు. ఇచ్చిన హమీలను వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2500 ఇస్తానని చెప్పి మర్చిపోయడాన్నారు.

ఇచ్చిన హమీలు నేరవేర్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారన్నారు. అధికారంలో ఉన్న లేకపోయిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసిందన్నారు. కేసిఆర్, కేటిఆర్ నాయకత్వంలో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, నాయకులు కపిల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నాగం రాజయ్య, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.