21-03-2025 12:36:59 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ లు గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. పార్లమెంట్ కార్యాలయంలో కేసీ వేణుగోపాల్‌ను కలిసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌తో పాటు బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లులు, సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై చర్చ జరిగింది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలు, రాష్ర్టంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు సురేశ్ పెట్కర్, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.