28-04-2025 02:01:28 PM
న్యూఢిల్లీ: రైతులకు రైతుభరోసా(Rythu Bharosa) కింద రూ. 12 వేలు అందిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(Congress MP Mallu Ravi) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల హామీ విస్మరించిందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు నిర్మాణానికి రూ. 5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. అందరికీ రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వెల్లడించారు.