21-04-2025 12:45:33 PM
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేటీఆర్, కవిత ఎక్కడ?
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేటీఆర్, కవిత ఎక్కడ ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Congress MP Chamala Kiran Kumar Reddy ) సోమవారం నాడు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్ సభలోనే సోనియాగాంధీ చెప్పారని ఎంపీ చామల గుర్తుచేశారు.
ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్(TRS) ఆవిర్భావం రోజు ఉన్న నాయకులు ఇవాళ ఆ పార్టీలో లేరని ఆరోపించి కాంగ్రెస్ ఎంపీ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని ఇవాళ సభ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు కేవలం కాపలా కుక్కలా ఉంటాన్న వ్యక్తి పదేళ్ల పదవి అనుభవించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితనేతను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ మూడోసారి పదవి ఇవ్వలేదని ప్రజలపై అలిగారని చామల(Congress MP Chamala) కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. కనీసం మూడోసారి అయినా.. బీసీ నేతను కానీ, ఎస్సీ నేతను కానీ సీఎంను చేస్తామని చెప్పట్లేదన్నారు.