calender_icon.png 26 January, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత్రి నిద్రపట్టక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు..

25-01-2025 02:29:22 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక ఎన్ని పెట్టుబడులు తెచ్చామో చూడాలన్నారు. మీరు తెచ్చిన రూ. 45 వేల కోట్లు పెట్టుబడులు ఏ దశలో ఉన్నాయో చెబుతానని ఎద్దేవా చేశారు. పదేళ్లలో మీరు తెచ్చిన పెట్టుబుడులు ఎన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్(KTR) ఆలోచనలు సరిగా లేవు.. అందుకే ఈనో ప్యాకెట్లు ఇచ్చామన్నారు. గతంలో అంతా దోచుకున్నారు... వాటి గురించి మాత్రం మట్లాడరన్నారు.రాత్రి నిద్రపట్టక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోర్టును ధిక్కరించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదని చెప్పిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ నాయకులకు తెలంగాణ ప్రజలు(Telangana People) బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.