calender_icon.png 24 February, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరేందర్‌రెడ్డి గెలుపే సామాజిక న్యాయం

20-02-2025 01:18:19 AM

కరీంనగర్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి  గెలుపు సామాజిక న్యాయం, రాజ్యాంగ స్ఫూర్తికి విజయమని పిసిసి రాష్ర్ట అధికార ప్రతినిధి, రాష్ర్ట గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. బుధవారం కరీంనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో సువర్ణాక్షరాలతో మేమెంతో మాకు అంత అనే కుల గణన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందన్నారు.

ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్ కు చట్టబద్ధత తీసుకొచ్చిందన్నారు. 29 రాష్ట్రాల్లో చారిత్రాత్మక ఘనత సాధించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికల్లో నిరుద్యోగులు యువత విద్యార్థులతో కలిసి 90 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టగా అన్ని వర్గాల ప్రజలు స్వాగతించి జేజేలు కొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేయడం జరిగిందన్నారు.

11,000 పైచిలుకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ, ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. లీకేజీ, ప్యాకేజీల కమిషన్ ను తీసివేసి కొత్త కమిటీ వేయడం జరిగిందన్నారు. త్వరలో గ్రూప్స్ ఫలితాలు వెలువడనున్నాయని, ఇది నిరుద్యోగుల, ఉద్యోగుల ప్రజాస్వామ్య ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగా ణలో సామాజిక స్వేచ్ఛ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో విశ్వాసము ఉండని వారు ప్రజల్లో ఉండకుండా కనుమరుగ వుతారని, ఆ కోవలోనే టీఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ శకం ముగిసింది అన్నారు.

తెలంగాణ పోరాట లక్ష్యాన్ని, మరో వీరుల ఆకాంక్షలను ఆయన విస్మరించారన్నారు. టిఆర్‌ఎస్ ను బిఆర్‌ఎస్ గా తెలంగాణ కన్నతల్లినే మార్చాడన్నారు. నిరుద్యోగులు, మేధావులు,  పట్టభద్రులు, ప్రజాస్వామ్య వాదులు కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయనవెంట శ్రీకృష్ణ, అజీబ్ తదితరులున్నారు.