13-03-2025 11:21:12 AM
గవర్నర్ ప్రసంగం వినలేని ప్రతిపక్షం రాష్ట్రానికి అవసరామా?
పదేళ్లలో గవర్నర్ ను అవమానించారు
దక్షిణ తెలంగాణను ఎండబెట్టిండ్రు..
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) రెండో రోజు కొనసాగుతున్నాయి. పదేళ్లలో గవర్నర్ ను అవమానించే విధంగా వ్యవహరించారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) ఆరోపించారు. గతంలో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించారని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగం(Governor's Speech) వినలేని ప్రతిపక్షం తెలంగాణ రాష్ట్రానికి అవసరమా.. అని ప్రజలు అనుకుంటున్నారని వేముల వీరేశం పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం విన్న తర్వాత సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం అందిస్తోందన్నారు. గతంలో ఓటు బ్యాంకు కోసం సంబంధించిన పతకాలే తీసుకువచ్చారు. తెలంగాణ దిశ, దశ మార్చే విధంగా ఒక్క పథాకాన్ని బీఆర్ఎస్ తీసుకురాలేదని ఆయన ఆరోపించారు. దక్షిణ తెలంగాణ(South Telangana)లో సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టి.. వివక్ష చూపించారని ద్వజమెత్తారు. గతంలో దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని తెలిపారు.