calender_icon.png 21 January, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అక్రమాలకు మారుపేరైన రాజకీయ నిరుద్యోగి పుట్టమధు

17-07-2024 04:51:17 PM

పెద్దపల్లి: మంథనిలో అవినీతి అక్రమాలకు మారుపేరైన రాజకీయ నిరుద్యోగి పుట్టమధు అని విలేకరుల సమావేశంలో మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐలి ప్రసాద్, నాయకులు వొడ్నాల శ్రీనివాస్, ఎరుకల ప్రవీణ్, నూకల బానయ్య, మంథని సత్యం, ఆర్ల నాగరాజు అన్నారు. బుధవారం వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... మా నాయకులు శ్రీధర్ బాబు, శ్రీనుబాబులను విమర్శించడం దొంగే దొంగన్నట్లుగా ఉందన్నారు. నీళ్ల ట్యాంక్ కు శంఖుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడిన మాటాలను వక్రీకరించి పుట్ట మధు తప్పుడు ఆర్థాలు తీస్తున్నారని వారు విమర్శించారు. 

నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ అల్లుళ్లు, నీ తమ్ముడు కమీషన్లకు కక్కుర్తి పడే మిషన్ కాకతీయ, భగీరథ, రోడ్లు, బ్రిడ్జిల పనుల్లో కాంట్రాక్టర్లును బెదిరించి కోట్ల రూపాయల సంపాదించింది వాస్తవం కాదా... అని ప్రశ్నించారు. మంథనిలో నీ ఇల్లు రాజాగృహల కట్టుకుంటే సరిపోదని, ప్రభుత్వ, మున్సిపల్ భవనాలు కూడా  అత్యంత హంగులతో నిర్మించాలనేది మంత్రి శ్రీధర్ బాబు ఆలోచన అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రమా మంథనిలో పుట్టలేదని పుట్ట  అనడం సరికాదని అన్నారు. అంబేద్కర్  రాజ్యాంగంలో ఏ వ్యక్తి  ఎక్కడైనా పోటీ చేసే హక్కు కల్పించాడని, మరి నువ్వు పదవి కోసం కమాన్ పూర్ లో జడ్పీటీసీగా పోటీచేసి గెలిచావు. కాదా మరి కమాన్ పూర్ లో పుట్టవా....నీ కెసిఆర్ గజ్వేల్ లో పుట్టడా? కేటీఆర్ సిరిసిల్ల లో పుట్టడా?ఎవరైనా ఎక్కడ నుంచి అయినా పోటీలో ఉండొచ్చనే జ్ఞానం లేకపోవడం సిగ్గుచేటన్నారు. 

మంథని ప్రజలు ఒక్క ఓటు వేస్తే ఆ ఒక్క ఓటుతో ఇద్దరు అన్నదమ్ములు ప్రజలకు పగలు రాత్రి అనే తేడా లేకుండా  వారి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకు కార్యకర్తల కోసం అనుక్షణం పని చేస్తున్నారని, మంథని మున్సిపల్ ఆఫీస్ ను అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించడం కోసం మంత్రి కలెక్టర్ కు అనువైన స్థలం కోసం ఆదేశాలు ఇచ్చారని, మున్సిపల్ ప్రజల ఆహ్లాదం కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణం  చేపట్టాలని అన్నారని, అదే స్విమ్మింగ్ పూల్ ఫ్రెండ్స్ క్లబ్ లో మీరు పెట్టారని, దాన్ని ఎందుకు పూర్తి చేయలేదని వారు ప్రశ్నించారు.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని భట్టి విక్రమార్క ను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యేలు అని ఏకవచనంతో సంబోధించడం నీ అహంకారానికి, ఆవివేకానికి నిదర్శనమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి మున్సిపల్ ఆఫీస్ కూడా నిర్మించలేని పుట్ట మంథని  అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకోవాలని చూస్తున్నారని, ప్రజలే నీకు బుద్ది చేపుతరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొలు శివ, బూడిద శంకర్, జనగామ నర్సింగరావు, పేరవేన లింగయ్య, గోటికర్ కిషన్ జి, ఐలి శ్రీనివాస్, పర్శావెన మోహన్ యాదవ్, ఆర్ల నారాయణ, పార్వతి కిరణ్, కందుకూరి రామ్మూర్తి, రేపాక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.