calender_icon.png 25 March, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ రుణమాఫీ పచ్చి మోసం

24-03-2025 01:45:33 AM

మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, మార్చి23 (విజయక్రాంతి): ఋణ మాఫీ విషయంలో అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రుణమాఫీ మోసం, బీజేపీ డీలిమిటేషన్ కుట్రలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ అని కూడా సోయిలేకుండా అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చేతులెత్తేశారని, చేయని ఋణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటు న్నారని విమర్శించారు. బ్యాంకుల లెక్క ప్రకారం రూ.49, 500 కోట్లని  కాంగ్రెస్ చెప్పింది రూ . 20,000 కోట్లు, కానీ మాఫీ చేసింది రూ  12,500 కోట్లు మాత్రమే అన్నారు. బ్యాంకులు చెప్పిన దానికి క్యాబినెట్, బడ్జెట్,  అసెంబ్లీలోకి వచ్చే సరికి 30 శాతం మాఫీ కూడా కాలేదన్నారు. 

మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని కాంగ్రెస్ బావిస్తున్నట్లుందని, అందుకే  జేబులు నింపుకుంటున్నారన్నారు. బడే భాయ్ దగ్గర మాట తీసికుని చోటే బాయ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని,  కిషన్ రెడ్డి అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది తోపాటు ఉత్తరాదిలో కూడా వ్యతిరేకత వస్తుందన్నారు. బీజేపీ కుట్రలు  సాగనీయమని తెలిపారు