01-04-2025 10:36:49 PM
మందమర్రి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డ్ దారులకు సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి సంబరాలు నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని అంగడి బజార్ ఏరియాలో ఉచిత సన్న బియ్యం పథకాన్ని రేషన్ షాప్ వద్ద నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోత్కు సుదర్శన్, పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ లు మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఉగాది నుండి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి మాట నిలుపుకున్నారని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, నాయకులు పుల్లూరి లక్ష్మణ్, గడ్డం రజిని, మంకు రమేష్, నెరవేట్ల శ్రీనివాస్, మంద తిరుమల్ రెడ్డి, ఎండి సుకూర్, జమీల్, రాజు, రాచర్ల రవి, బుర్ర ఆంజనేయులు, సోతుకు ఉదయ్, సట్ల సంతోష్, రాచర్ల గణేష్, రాయబారపు కిరణ్, మాయ తిరుపతి, బండి శంకర్, వీరన్న, నరసయ్య రావుల శ్రీనివాస్, రాజయ్య లింగయ్యలు పాల్గొన్నారు.