12-04-2025 04:24:51 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో వల్లూరు గ్రామంలో శనివారం మండల ఉపాధ్యక్షులు వినోద్, కోఆర్డినేటర్ రాజా గౌడ్, ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్, నినాదాలతో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా యాత్ర నిర్వహించారు. డాక్టర్ బి అర్ అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం కోఆర్డినేటర్ జుకంటి రాజగౌడ్ మాట్లాడుతూ... రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలిపారు.
పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను అమలు చేసి బీదలను ఐశ్వర్యవంతులుగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం అని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రజల మీద మోపుతున్న భారన్నీ, ఎండగట్టాలని, ప్రజలను కోరారు. మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలను తిప్పికొట్టాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు గోవర్ధన్, గ్రామ అధ్యక్షు చాకలి స్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్, బాబా గౌడ్, అంచనూర్ రాజేష్, మోతిలాల్, రఫిక్, తదితరులు ఉన్నారు.