calender_icon.png 26 December, 2024 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ దేవాలయంలో కాంగ్రెస్ నాయకుల పూజలు

04-12-2024 04:29:21 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు కన్నాల గ్రామ పంచాయతీలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ తొంగల మల్లేష్ గారి అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు సుభిక్షమైన పాలన అందుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోవర్ధన్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అచ్చే శివ, జిల్లా జనరల్ సెక్రటరీ సింగతి కిరణ్ కుమార్, బెల్లంపల్లి మండల యూత్ ప్రెసిడెంట్  భామండ్లపల్లి భరత్, సీనియర్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు దుర్గం శ్రావణ్, మండల ఉపాధ్యక్షులు సంకురి శంకర్, అంకుశం గ్రామ ఉప సర్పంచ్ భాను చందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.