మందమర్రి (విజయక్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన నిరుపేద కుటుంబానికి పట్టణ కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించారు. పట్టణంలోని విద్యానగర్ కు చెందిన గోడిసెల రాజం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడు బీద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచన మేరకు కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. అంతే కాకుండా అనంతరం విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన ఆవునూరి రాయమల్లు అనారోగ్యంతో మృతిచెందగా బాధిత కుటుంబానికి కూడా 10000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ఇరువురు పేద కుటుంబాలు కావడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్, మాజీ పట్టణ అధ్యక్షులు మంకు రమేష్, ఎండి సుకూర్, జంగంపల్లి రాజేష్, కొట్టే కొమురయ్య, చిద్రల సతీష్, ఏటూరి సత్యనారాయణ, లింగయ్య, మాయ తిరుపతి, కత్తి రమేష్, లు పాల్గొన్నారు.