calender_icon.png 18 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిక వడ్డీ పేరుతో మోసం.. న్యాయం జరిగేవరకు పోరాటం : వీహెచ్

13-07-2024 08:35:23 PM

నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందచేసింది. సాయిబాబా అనే వ్యక్తి ఆ డబ్బులను అధిక వడ్డీ ఆశ చూపి దాదాపు 1400 పైగా రైతులను మోసం కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. ఇప్పుడు తమ డబ్బులు ఇవ్వామని అడిగితే తప్పించుకోని తిరుగుతున్నాడంటూ రైతు వాపోతున్నారు.

ఈ విషయంపై కొంతమంది నేతలు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంత రావును కలిశారు. దీంతో ఆయన శనివారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ను కలసి విన్నతి పత్రం అందజేశారు. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేసి తము మోసపోయిన ఇచ్చిన డబ్బులను తిరిగి ఇప్పించి చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకకు బాధితుల, రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తానని విహెచ్ తెలిపారు.