calender_icon.png 19 January, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమంతరావుకు స్వాగతం పలికి కాంగ్రెస్ నాయకులు

18-01-2025 06:26:51 PM

కొండపాక : రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంవిధాన్ యాత్రలో పాల్గొనడానికి చేర్యాలకు వెళ్తున్న రాజ్యసభ మాజీ సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావుకు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి వద్ద సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు శనివారం స్వాగతం పలికారు. హనుమంతరావు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. టీపీసీసీ కార్యదర్శి గంప మహేందర్ రావు, పీసీసీ సెక్రెటరీ లక్ష్మన్ యాదవ్, ముద్దం లక్ష్మీ, వహీద్ ఖాన్, బొమ్మల యాదగిరి, షాబు, అక్బర్, ప్రవీణ్, రజిని, సన, ప్రసాద్ కుక్కునూరుపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, తదితరులు హనుమంతరావును కలిశారు.