calender_icon.png 11 February, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

10-02-2025 08:40:33 PM

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని శాత్రాజుపల్లి గ్రామాన్ని తొలగించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కలపడంతో, శాత్రాజుపల్లి గ్రామ ప్రజలు మా గ్రామం ముత్తారం మండలంలోనే ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి ఉన్నతాధికారులకు శాత్రాజుపల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలోనే ఉంచాలని అధికారులను ఆదేశించారు. అధికారులు శాత్రాజుపల్లి గ్రామాన్ని యధావిధిగా ముత్తారం మండలం కొనసాగిస్తున్నారు. ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు నాగిని జగన్ మోహన్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, ముత్తారం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్, వారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.