బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు 70వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణoలోని వివిధ వార్డులనుండి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి కేక్ కట్ చేయించి, పూలమాలలతో, శాలువాలతో సూరిబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ గెల్లి జయరాం , జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రాము, మంచిర్యాల జిల్లా సేవాదళ్ చైర్మన్ నహీం భాయ్, దుర్గం గోపాల్, రాజు బ్రహ్మం, పార్టీ సీనియర్ నాయకులు కంకటి శ్రీనివాస్, ముక్త రాజన్న, ఎనగందుల వెంకటేష్, గెల్లి రాజలింగు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.