04-04-2025 05:00:03 PM
కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు గుండెల్లో నిలుస్తాయి
కల్లూరు,(విజయక్రాంతి): మండలం పరిధిలో పేరువంచ గ్రామ పంచాయతీ లో చౌక దుకాణం లో సన్న బియ్యం పంపిణి కార్యక్రమంను ప్రారంభించిన రేషన్ డీలర్ రాయల నాగేశ్వరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కిసర.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పేద, మధ్యతరగతి ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం అందించటం తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. కిసర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రమే కాదు. ప్రజలు కష్టాలు తెలుసుకొని మరెన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు చూస్తూనే వున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ లో అర్హులైన ప్రతి ఒక్కరి గుమ్మానికి పథకాలు చేరతాయి అని అన్నారు. జోనబోయిన గోపాల్ రావు మాట్లాడుతూ... సన్న బియ్యం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సందర్బంగా పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంతోషం చూస్తున్నాము. ప్రజలు గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిలుస్తాయి అని ఎమ్మెల్యే తెలిపారు.