మందమర్రి,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిదిలోని మందమర్రి(వి) గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన యువతులకు కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందచేశారు. ఆదివారం గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకొని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా గ్రామానికి చెందిన భూనేని దోనాచారి-లక్ష్మి దంపతులు అనారోగ్యంతో మరణించగా వారి కూతుర్లు అర్చన, అభిలాషలు అనాధలుగా మారారు.
పేదరికంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబం తల్లిదండ్రులను కోల్పోవడంతో చదువుకునే ఇద్దరు ఆడపిల్లలు రోడ్డున పడే పరిస్థితి రావడం చాలా బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆకుటుంబానికి వెన్నంటి ఉంటామని భవిష్యత్తులో సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరులల్ రెడ్డి, రాయబారపు కిరణ్, సట్ల సంతోష్,పాల్గొన్నారు.