calender_icon.png 21 November, 2024 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకపక్ష నిర్ణయం సరైనది కాదు

21-11-2024 06:39:50 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకపక్ష నిర్ణయం సరైంది కాదని బీర్పూర్ నస్రుల్లాబాద్ మండలాల కాంగ్రెస్ నాయకులు గురువారం బీర్కూరులో రవీందర్ రెడ్డి వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. దశబ్దాల కాలంగా కాంగ్రెస్ లో పనిచేసిన తమను విస్మరించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులను పోచారం ఇచ్చారని వారు విమర్శించారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను పక్కనపెట్టి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వర్గం వారికి పదవులు అంటగడుతున్నారని ఆరోపించారు.

బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులకు మార్కెట్ కమిటీ పదవులలో ప్రాధాన్యం ఇవ్వలేదని వారు ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్లు బీర్పూర్ మార్కెట్ చైర్ పర్సన్ నియామకం చేశారని మండల కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చొరవ తీసుకొని గత కొన్ని ఏళ్లుగా పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇకనైనా ఉంటే పోకడలకు పోవద్దని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు గుర్తించి పదవులు అప్పగించాలని కోరారు.