22-03-2025 05:30:12 PM
రూ. 2000 కోట్లతో రాష్ట్రంలోనే మంథని కిఅత్యధిక నిధులు
మంథనిలో ప్రెస్ క్లబ్ లకు రాజకీయ రంగు పులిమింది పుట్ట మదే
మంథనిలో విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
మంథని,(జయక్రాంతి): మంథని నియోజకవర్గంలో పది ఏళ్లలో కాని అభివృద్ధి 15 నెలల్లోనే చేసి చూపించామని, దానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తామని మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సవాల్ విసిరారు. మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పెండ్రూ రమాదేవి, ప్రచార కమిటీ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఎస్సీసెల్ ల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శులు జనగామ నరసింహరావు, కుడుదుల వెంకన్న మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదని, ఐదు ఏండ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పుట్ట మధుకు తెలియకపోవడం సిగ్గుచేటు అన్నారు. అవగాహన లేని ఆలోచనలు వచ్చిన వెంటనే అదే పనిగా మంత్రి శ్రీధర్ బాబు పై ఆసత్య ఆరోపణలు చేస్తు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని పుట్ట మధుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంథని లో ప్రెస్ క్లబ్బులకు రాజకీయరంగు పులిమింది పుట్ట మధు అన్నారు. డివిజన్ స్థాయిలో మంథని కేంద్రంగా కొంతమంది ప్రెస్ మిత్రులు డివిజన్ స్థాయి క్లబ్ ఏర్పాటు చేసుకుంటే అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అంతా శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులేనని, కులం ప్రస్తావన తీసుకురావడం పుట్ట మధుకు సరికాదన్నారు. ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ రెండు మూడు ఓట్లు ఉన్నాయని తరచు విమర్శించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మంతిని నియోజకవర్గం వర్గానికి నిధులు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి శ్రీధర్ బాబేనని, పీవీ నరసింహారావు తర్వాత అంత పెద్ద హోదాలో కలిగిన ఏకైక వ్యక్తి మన మంత్రి శ్రీధర్ బాబు అనడానికి గర్వకారణం అన్నారు.
మంథని నియోజక వర్గంలో, పట్టణంలో గతంలో ఎన్నడు లేని విధంగా వాడవాడల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కేవలం తన రాజకీయ ఉనికి కోసమే టూర్లకు వెళ్లి వచ్చి పత్రికల్లో కనిపించేందుకు ప్రెస్ మీట్ లు పెడుతున్న పుట్ట మధు నీకు ప్రజలే ఓటు తో బుద్ధి చెప్పిన బుద్దిరాలేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, బీసీ సెల్ డివిజన్ ఉపాధ్యక్షులు గొటికరి కిషన్ జి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీమ్ ఖాన్, పేరవేనా లింగయ్య,పెండ్ర్ ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు దొరగొర్ల శ్రీనివాస్, చంద్రు రాయమల్లు, మధు, రవికంటి సతీష్, లైసెట్టి రాజు, మంథని సమ్మయ్య, కాసిపేట బాపు, అక్కపాక సది, బూడిద రంజిత్, మంథని శ్రీనివాస్, జనగామ సడవలి, పోగుల సాగర్, ఎరుకల రమేష్ బాబు, పోరండ్ల రంజిత్, ఎరుకల సురేష్, పార్వతి కిరణ్, బూడిద రమేష్, చంద్రు విజయ్, ఎరుకల మోహన్ సాయి, అట్టెం వినయ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.