calender_icon.png 29 April, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు

28-04-2025 10:15:34 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడినందుకు అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులపై గత ప్రభుత్వం అక్రమ కేసులు, బైండోవర్లు పెట్టడం ఆనవాయితీగా మారిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అప్పటి హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు.

అందులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు కోర్టుకు హాజరయ్యారు.కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని భయభ్రాంతులకు గురిచేయాలని చూసిందని, భయపడకుండా ప్రజల కోసం పోరాటం కొనసాగించామని వారు తెలిపారు. కోర్టుకు హాజరైన వారిలో మాజీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు, మాజీ మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, కసుబోజుల వెంకన్న, ఎండీ సలీం, ఎండీ అఫ్సర్, అలేటి సుశీల, మహేశ్వరి, కొడెం రజిత ఉన్నారు.