దివిటిపల్లిలో డబుల్ బెడ్ రూమ్లు ఇవ్వాలని నాడు ఆందోళనతో చేశారని కేసు నమోదు
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): నాడు దివిటిపల్లి దగ్గర డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారని నమోదైన కేసులో మంగళవారం కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైనట్లు వారు తెలియజేశారు. కోర్టుకు హాజరైన వారిలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేష్, మహబూబ్ నగర్ జిల్లా మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ చైర్మన్ బెక్కరీ అనిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సాయిబాబా, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫాయాజ్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు రాములు, మాజీ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జె.చంద్రశేఖర్, మైనార్టీ అసెంబ్లీ చైర్మన్ ఫక్రు ఖురేషి, మాజీ యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ అబ్దుల్ హక్, ఎన్ఎస్యుఐ జిల్లా జనరల్ సెక్రటరీ ముకుంద రమేష్, హనీఫ్, అలీ తదితరులు ఉన్నారు.