calender_icon.png 27 April, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ నాయకులు

26-04-2025 07:40:14 PM

చేగుంట/నార్సింగి (విజయక్రాంతి): లబ్దిదారుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మెదక్ జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షుడు జంగర్ల గోవర్ధన్ శనివారం అందజేశారు. శేరిపల్లి గ్రామానికి చెందిన పోకల శ్రీశైలం ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ఆయనకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో చెక్కు మంజూరు కాగా గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో లబ్ధిదారుడికి చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే రోహిత్ ఎల్లప్పుడూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తారని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. చెక్కును మంజూరు చేయించినందుకు లబ్ధిదారుడు ఎమ్మెల్యే రోహిత్ కు, సహాయ సహకారాలు అందించిన గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తాళ్ల కృష్ణా గౌడ్, గజవెల్లి లక్ష్మీ నరసింహులు, తాళ్ల చిన్న కృష్ణ గౌడ్, శ్రీరామ్ భరత్, శ్రీరామ్ మల్లేశం, జయరాం గౌడ్, అశోక్ గౌడ్, సత్తయ్య, యూత్ నాయకులు సంధిగారి బాలకృష్ణ గౌడ, చేప్యాల బాబు తదితరులు పాల్గొన్నారు.