calender_icon.png 4 April, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్ యాత్రలో కాంగ్రెస్ నాయకులు

03-04-2025 08:28:31 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఏఐసీసీ పిలుపు మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు గురువారం మున్సిపాలిటీ లోని పలు వార్డులలో జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ పాదయాత్రకు ముఖ్యఅతిథిగా టీపీపీసీ జెనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా చీట్ల సత్యనారాయణ మాట్లాడుతూ... నేడు లక్షెట్టిపేటలో రెండో రోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ను నిర్వహిస్తున్నామన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు గాంధీ చూపిన బాటలో నడుస్తూ భారతదేశాన్ని, మన రాజ్యాంగాన్ని కాపాడుకుందామని అన్నారు. ఇటీవల బీజేపీ పార్టీ పరిణామాలు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి అని అన్నారు. మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ల యొక్క ఆశయాలను లక్షెట్టిపేట మున్సిపాలిటీ వార్డులలో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల నియోజకవర్గంకు ప్రభుత్వ నుంచి నిధులు తీసుకవస్తు అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, మాజీ ఎంపీటీసీ మడిపెల్లి స్వామి, యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, మాజీ  కౌన్సలర్ సురేష్ నాయక్, రాందేని వెంకటేష్, వెంకటస్వామి గౌడ్, రాజన్న అమీర్, గోపతి రమేష్, రాజు, రవీందేర్ సుగుణకర్, గడుసు రవీందేర్, రాకేష్, బాణాల రమేష్, రఫీక్, మహిళా కార్యకర్తలు వివిధ వార్డ్ అధ్యక్షులు పాల్గొన్నారు.