calender_icon.png 5 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటేశ్వరాలయంలో కాంగ్రెస్ నాయకుల పూజలు

31-03-2025 12:00:00 AM

మందమర్రి, మార్చి 30 : పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో కాంగ్రెస్ నాయకులు పూజలు నిర్వహించారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్  జిల్లా ఉపాధ్యక్షులు పుల్లూరి లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహంత్ అర్జున్ కుమార్ లు  మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి దంపతులు, పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ  కుటుంబ సభ్యులు బాగుండాలని పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు.

అంతేకాకుండా రానున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామికి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కేలా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి వారి  కుటుంబానికి ఉండాలని వారు  కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ కాంగ్రెస్, దాని  అనుబంధ సంఘాల నాయకులు  ఓరగంటి సురేందర్, మాసు పెద్దిరాజు, భీమరపు సదానందం, చిన్న, సంతోష్, శ్రీనివాస్, అంజి నాయక్ లు పాల్గొన్నారు.