calender_icon.png 1 November, 2024 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తేదీలు కావు : బల్మూరి వెంకట్

18-07-2024 03:51:01 PM

హైదరాబాద్ : గంపేట్ టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో గురువారం కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. గత కొన్ని రోజులగా డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. దీంతో  ఎంపీ చామల కిరణ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులతో భేటీ అయి నిరుద్యోతుల డిమాండ్లపై చర్చించారు. నిరుద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని బల్మూరి వెంకట్ తెలిపారు. సానుకూలమైన ప్రకటన వచ్చేందుకు కృషి చేస్తామని, డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య తక్కువ వ్యవధి ఉందని వెంకట్ పేర్కొన్నారు. పరీక్షలకు ఉద్దేశపూర్వకంగా ఇచ్చిన తేదీలు కావు అని, గ్రూప్-2 పరీక్షలపై సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెప్పారు.